Wheat Export Ban: గోధుమ ఎగుమతులపై నిషేధం.. భారత్‌కు మద్దతు పలికిన చైనా
గోధుమ ఎగుమతులను నియంత్రిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై జీ7 దేశాలు చేస్తున్న విమర్శలకు చైనా స్పందించింది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను నిందించినంత మాత్రాన ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభానికి పరిష్కారం లభించదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్ కంటే ముందు గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను గౌరవిస్తామని ప్రకటించింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామంటూ.. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని విదేశీ వాణిజ్య కార్యాలయం(డి.జి.ఎఫ్.టి)భరోసా ఇచ్చింది.
Wheat Exports: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?