Global Wealth Report-2022: ‘సంపాదన’లో సగం వారిదే
ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి.. ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులు కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు.‘క్రెడిట్‌సూయిస్’ సంస్థ ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఇటీవల ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022’ విడుదల చేసింది. ఇందులో 2021 సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021 ఆఖరునాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. అందులో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని.. మిగతా సగం అన్ని దేశాల పౌరుల వ్యక్తిగత సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరుల వాటా 31.5 శాతం కాగా, తర్వాత స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతం. 3.1 శాతం వాటాతో మన దేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP