G7 Foreign Ministers Meeting: జీ–7 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
జర్మనీలోని వీసెన్‌హాస్ వేదికగా మే 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీ–7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రపంచ సంక్షోభంగా పరిణమిస్తోందని జీ–7 విదేశాంగ మంత్రులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యే ప్రమాదం ఉందన్నారు. రష్యాకు ఏ రూపంలోనూ సాయమందించినా తీవ్ర పరిణామాలుంటాయని చైనాను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సాయం పెంచాలని తీర్మానించారు.
జీ–7 కూటమి..
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఆరు దేశాలు 1975లో జీ–6 కూటమిగా ఏర్పడ్డాయి. జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్‌ఏ) దేశాలతో కూడిన జీ–6 తొలి సదస్సు ఫ్రాన్స్‌లో(1975 నవంబరు) జరిగింది. 1975లో కెనడా ఏడో సభ్యదేశంగా చేరడంతో జీ–7గా మారింది. 1998లో ఈ కూటమిలో రష్యా చేరికతో జీ–8గా అవతరించింది. క్రిమియా సంక్షోభం కారణంగా 2014, మార్చి 24న రష్యా జీ–8 నుంచి సస్పెండ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ కూటమి జీ–7గా మారింది.
విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం, వాతావరణం, వ్యవసాయం, కార్మిక సమస్యల వంటివి జీ–7 సదస్సుల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) ఈ కూటమిలో సభ్యదేశం కానప్పటికీ సమావేశాలకు హాజరవుతుంది.
Marilyn Monroe: 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీ–7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : మే 11–15
ఎవరు : అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్
ఎక్కడ : వీసెన్‌హాస్, జర్మనీ
ఎందుకు : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు..