Ukraine: స్నేక్‌ఐలాండ్‌పై ఉక్రెయిన్ పతాకం
నల్ల సముద్రంలోని స్నేక్‌ఐలాండ్‌పై ఎట్టకేలకు ఉక్రెయిన్ పతాకం ఎగిరింది. సద్భావన చర్యగా చెబుతూ రష్యా దళాలు ఇక్కడి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. మొత్తం పావు చదరపు కిలోమీటరు వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపం నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఇది సముద్రమట్టం కంటే 41 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఉక్రెయిన్ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంపై పట్టు సాధించిన దేశం నల్ల సముద్రంలో నౌకల కదలికలపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దక్కించుకుంటుంది. మూడు శతాబ్దాల కాలంలో ఇది రష్యా, టర్కీ, రొమేనియా, ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లింది. తాజాగా ఉక్రెయిన్ పై దాడి చేసిన తొలి రోజే రష్యా దళాలు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టాయి.మాస్కోవా యద్ధ నౌక రంగంలోకి దిగి ఈ ద్వీపంపై క్రూజ్‌క్షిపణుల వర్షం కురిపించింది. దీనిపై కట్టడాలు, లైట్‌హౌస్‌ను కూల్చివేసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP