Republic Day celebrations: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా ఈజిప్టు అధ్యక్షుడు అల్‌సిసి
Sakshi Education

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ఫతాహ్ అల్‌సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా, భారత రిపబ్లిక్‌డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే తొలిసారి. భారత్, ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 09 Dec 2022 03:38PM