Economic Freedom of the World index: ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్' సూచీలో భారత్‌కు 87వ స్థానం
Sakshi Education
కెనడాకు చెందిన ఫ్రేసర్ ఇన్‌స్టిట్యూట్, దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి రూపొందించిన ‘ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్- 2021’ వార్షిక నివేదికను గురువారం విడుదల చేసింది.
ఆర్థిక స్వేచ్ఛా సూచీలో మొత్తం 165 దేశాలకుగాను భారత్‌కు 87వ స్థానం లభించింది. 2022లో 86వ ర్యాంకు సాధించగా, ప్రస్తుతం ఒక స్థానం తగ్గింది. దక్షిణాసియాలో మాత్రం భారత్ స్థానం మెరుగ్గా ఉంది. సూచీలో సింగపూర్ అగ్ర స్థానంలో నిలిచింది. హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యూఎస్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యూకే, కెనడాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వెనిజువెలా చివరి స్థానంలో నిలిచింది. చైనా 111వ స్థానంలో ఉండగా, జపాన్ 20, జర్మనీ 23, ఫ్రాన్స్ 47, రష్యా 104 స్థానాల్లో ఉన్నాయి.
Global Happiness Rank: ఆనందంగా పనిచేయడంలో భారతీయులదే అగ్రస్థానం
Published date : 22 Sep 2023 05:39PM