Skip to main content

Delhi Declaration Approved: జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం

జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ సంఘర్షణ అంశాలతో కూడిన ఢిల్లీ డిక్లరేషన్‌ను రష్యా, చైనా అంగీకరించాయి.
Delhi Declaration Approved, G-20 summit
Delhi Declaration Approved

ఇండోనేషియా వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ సంఘర్షణను చర్చించడానికి రష్యా, చైనా దేశాలు  నిరాకరించాయి. సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్‌ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక కష్టించి పనిచేసిన జీ20షేర్పా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 

G-20 Summit: G20 ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారో తెలుసా!

ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. అవి..

  •  బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమగ్ర వృద్ధి
  • వేగవంతమైన సుస్థిరాభివృద్ధి
  • సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం
  • 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు
  • బహుపాక్షికతను పునరుద్ధరించడం

G-20 Summit: విశ్వ శ్రేయస్సుకు జి–20

జీ20 సదస్సులో అభివృద్ధి, భౌగోళిక-రాజకీయ సమస్యలపై 100 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని జీ20 భారత షేర్పా అమితాబ్ కాంత్ అన్నారు. 'జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఢిల్లీ నాయకుల డిక్లరేషన్‌ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. భారత్ నాయకత్వంలో జీ20 సదస్సు నిర్వహించడం ప్రపంచీకరణకు స్వర్ణ యుగంగా గుర్తింపు పొందింది.' అని అమితాబ్ కాంత్ అన్నారు. డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు భౌగోళిక, రాజకీయ అంశాల్లో భూమి, ప్రపంచ శాంతి, ప్రజల శ్రేయస్సుకు పిలుపునిచ్చారు. 

G20 Summit: G20 ల‌క్షాలేంటి?

Published date : 11 Sep 2023 02:41PM
PDF

Photo Stories