Pangong Lake: పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం పూర్తి
పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద చైనా చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయింది. దీంతో పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని స్పంగూర్ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్‌లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది. తాజాగా ఈ వంతెనను సమీపంలోని భారీ చైనా సైనిక స్థావరానికి అనుసంధానించేలా రహదారి నిర్మాణం చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. 2020 ఆగస్టులో భారత దళాలు బ్లాక్ టాప్ శిఖరాన్ని స్వాధీనం చేసుకొనే సమయంలో నిర్వహించిన ఆపరేషన్ వంటివి భవిష్యత్తులో చేపట్టాలంటే మరింత కష్టపడాల్సి రావొచ్చు. ఖుర్నాక్ సమీపంలో ఆ దూరం 500 మీటర్లే! అక్కడ గతేడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఈ నిర్మాణం ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది.
Nuclear Weapons: ప్రపంచంలో అత్యధిక అణు వార్‌హెడ్లు కలిగిన దేశం?