2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం ఆసియాలోనే వినియోగం
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో సగం మొత్తాన్ని ఒక్క ఆసియానే వినియోగించుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) వెల్లడించింది. చరిత్రలో తొలిసారి 2025లో ఆసియా ఈ ఘనతను సాధిస్తుందని విడుదల చేసిన భవిష్యత్తు అంచనా నివేదికలో ఐఈఏ ప్రకటించింది. ఐరోపా సమాఖ్య, అమెరికా, భారత్‌లు కలిపి వినియోగించే విద్యుత్ కంటే చైనా ఎక్కువ కరెంటును ఉపయోగించనుందని ఈ నివేదిక పేర్కొంది. ఆ సమయానికి ప్రపంచ జనాభాలో అయిదో వంతుకు ఆశ్రయమివ్వనున్న ఆఫ్రికా మౌలికవసతుల కొరత కారణంగా ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడు శాతం కరెంటును మాత్రమే వినియోగించుకుంటుందని ఐఈఏ అంచనా వేసింది. విద్యుదుత్పత్తిలో అణు, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం గణనీయంగా పెరగడం వల్ల ఆ మేరకు వాయుకాలుష్యం తగ్గనుందని ఈ నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. సంప్రదాయేతర వనరుల వినియోగం మరింత పెరగాలని నివేదిక స్పష్టం చేసింది. గతేడాది యూరోప్, భారత్, మధ్య, తూర్పు చైనాల్లో ఉష్ణపవనాలు, కరవు పరిస్థితులు ఏర్పడగా.. అమెరికాలో శీతల పవనాలు ఇబ్బందులు సృష్టించాయని ఐఈఏ వెల్లడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP