Skip to main content

Apollo Tyres: హెదరాబాద్‌లో డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది.

లండన్‌ తరువాత ఇది తమ రెండవ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ అని తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్, ఎండీ నీరజ్‌ కన్వర్‌లు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ఈ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్‌ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల సంస్థలతో వినూత్న ఆవిష్క రణలకు ఊతం ఇచ్చే అద్భుతమైన వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  

World Economic Forum: హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సెంటర్

Published date : 18 Jan 2023 05:21PM

Photo Stories