Skip to main content

American Citizenship 2022: అమెరికా పౌరసత్వం... భారత్‌ది రెండోస్థానం

american citizenship india rank 2022
american citizenship india rank 2022

అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో.. కొత్తగా పౌరసత్వం పొందిన దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం– ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి యూఎస్‌ పౌరసత్వం ఇవ్వగా.. వీరిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా.. భారత్‌కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌(11,316), క్యూబా(10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌(7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్‌లు ముందంజలో ఉండగా.. క్యూబా, ఫిలిప్పీన్స్‌, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి. 

GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 16 Jul 2022 06:29PM

Photo Stories