Skip to main content

53 Chinese foreign companies in India: భారత్‌లో చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు వ్యాపార కేంద్రాలు

చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Foreign investments: China's business centers thrive in India  53 Chinese foreign companies established in India  Chinese companies establish business centers in India
53 Chinese foreign companies established in India

యాప్‌ ద్వారా రుణాలు ఇచ్చే విషయమై ఇవి ఎలాంటి డేటాను నిర్వహించడం లేదని తెలిపింది. విదేశీ కంపెనీ (భారత్‌కు వెలుపల ఏర్పాటైనది) దేశంలో వ్యాపార కేంద్రాలు తెరుచుకోవచ్చు.

India joins the UN food standards body: ఐరాస కీలక కమిటీలో భారత్‌కు సభ్యత్వం

కాకపోతే ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ, ఇతర నియతంణ్ర సంస్థల నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. భారత్‌లో అటువంటి కేంద్రం తెరిచిన 30 రోజుల్లోపు రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద రిజిష్ట్రేన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై బదులిచ్చారు. చట్టం పరిధిలో షెల్‌ కంపెనీలకు సంబంధించి ఎలాంటి నిర్వచనం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

7,700 కంపెనీల మూత

సెంటర్‌ ఫర్‌ ప్రాసెసింగ్‌ యాక్సిలరేటెడ్‌ కార్పొరేట్‌ ఎగ్జిట్‌ (సీపేస్‌)ను ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన తర్వాత నుంచి, దీని కింద 7,700 కంపెనీలు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసినట్టు లోక్‌సభకు రావు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. స్వచ్చందంగా వ్యాపార కార్యకలాపాల నుంచి తప్పుకోవాలనుకునే కంపెనీలకు, దాన్ని వేగవంతంగా సాకారం చేసేందుకు ఈ ఏడాది మే 1 నుంచి సీపేస్‌ను కార్పొరేట్‌ శాఖ తీసుకొచి్చంది. దీంతో ఒక కంపెనీ స్వచ్చంద మూసివేతకు పట్టే సమయం 110 రోజులకు తగ్గిపోయింది.

Companies moving out of China: భారత్‌పై చైనాలోని కంపెనీల చూపు

Published date : 15 Dec 2023 04:40PM

Photo Stories