బయటపడిన పురాతన నగరం
Sakshi Education
ఏ దేశంలో 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది?
ఇరాక్ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది. కరవు కారణంగా ఇక్కడి ఓ భారీ జలాశయం ఎండిపోవడంతో ఈ నగర ఆనవాళ్లు వెలుగుచూశాయి. టైగ్రిస్ నది ఎండిపోయిన ప్రాంతంలో కనిపించిన ఈ నగరం కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. నదిలో నీళ్లు లేకపోవడంతో.. ఇక్కడ తవ్వకాలకు వీలు కుదిరింది. క్రీ.పూ.1550–క్రీ.పూ.1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో ఈ నగరం కీలక కేంద్రంగా విలసిల్లి ఉండొచ్చని కుర్దిష్, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.
GK International Quiz: ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న అల్-అక్సా మసీదు ఏ దేశంలో ఉంది?
Published date : 14 Jun 2022 07:04PM