Shanghai Cooperation Organization: 21వ ఎస్‌సీవో సదస్సు ఎవరి అధ్యక్షతన జరగనుంది?
తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్‌సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించనున్నారని భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్ 15న వెల్లడించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి సదస్సులో పాల్గొంటారని తెలిపింది. ఎస్‌సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి.
ఎనిమిది దేశాల కూటమిగా...
నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్‌సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్‌లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్‌సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్‌సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది.
చదవండి: క్వాడ్ సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షతన 2021, సెప్టెంబర్ 17న 21వ షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) సదస్సు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎక్కడ : దుషాంబే, తజకిస్తాన్
ఎందుకు : అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలు, సమకాలీన అంశాలపై చర్చలు జరిపేందుకు...