Skip to main content

2023 set to be hottest year on record: చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2023

నెల రోజుల్లో ముగిసిపోనున్న 2023 ఏడాది.. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) గురువారం నివేదించింది.
WMO Declares 2023 the Hottest Year in History  2023 set to be hottest year on record   World Meteorological Organization's Update
2023 set to be hottest year on record

 నివేదిక తాలూకు వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది 1.4 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగిందని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి పిటేరీ టాలస్‌ చెప్పారు.

COP28: కాప్‌– 28 సమావేశాల్లో భారత్ కీలక పాత్ర

‘‘ఈ ఏడాది తొలినాళ్లలో పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కి సంభవించిన ‘ఎల్‌నినో’ పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రి సెల్సియస్‌ను దాటనుంది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే నాలుగేళ్లు 1.5 డిగ్రీ సెల్సియస్‌ నమోదయ్యే వీలుంది. ఆ తర్వాత దశాబ్దంలో ఇది సర్వసాధారణ స్థితిగా నిలిచిపోయే ప్రమాదముంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

World Climate Summit: వాతావరణ మార్పులతో మొత్తం మానవాళికే సమస్య!

Published date : 01 Dec 2023 01:29PM

Photo Stories