Skip to main content

ASEAN-India Friendship year: ఏసియ‌న్‌-భారత్ స్నేహ సంవత్సరంగా 2022

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏసియ‌న్‌తో భారతదేశం 30 సంవత్సరాల భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకుంటూ 2022 సంవత్సరాన్ని ఏసియ‌న్‌-భారతదేశ స్నేహ సంవత్సరంగా ప్రకటించబడింది.
ASEAN-India Friendship year 2022

ఈ వేడుకను సంవ‌త్స‌రం పొడ‌వునా జరుపుకోవడానికి వరుస కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా భారత మీడియా ప్రతినిధి బృందం నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు ఏసియ‌న్-భార‌త్‌ మీడియా మార్పిడి కార్యక్రమం కింద సింగపూర్, కంబోడియా పర్యటన చేసింది.

భారత్ మొదట సెక్టోరల్ భాగస్వామిగా 1992లో ఏసియ‌న్‌లో చేరింది. అనంత‌రం ఏసియ‌న్‌తో సంబంధాలు పెరుగడంతో మ‌న హోదాను 1996లో డైలాగ్ పార్టనర్‌గా మార్చారు. 2022లో ఈ సంబంధాన్ని శిఖరాగ్ర స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. చివరకు 2012లో ఇది వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎలివేట్ చేయబడింది. 

Published date : 15 Nov 2022 04:11PM

Photo Stories