Crude oil : రష్యా నుంచి రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు
Sakshi Education
రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి డిసెంబరులో మరింత పెరిగింది.
మన దేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా వరుసగా మూడోనెలా తొలిస్థానంలో నిలిచింది. 2022 డిసెంబరులో రికార్డు స్థాయిలో రోజుకు 10 లక్షల బ్యారెళ్లకు పైగా చమురు దిగుమతి అయినట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్స్ వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగించుకునే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మన దేశం మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది.
అక్టోబరులో తొలిసారిగా ఇరాక్, సౌదీ అరేబియాను అధిగమించి భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశంగా రష్యా నిలిచింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురులో ఇప్పుడు ఆ దేశ వాటా 25 శాతంగా ఉంది.
Also read: Amazon Web Services: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.36వేల కోట్లు
Published date : 23 Jan 2023 03:50PM