Skip to main content

Covid Death: వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి?

చైనా జీరో కోవిడ్‌ విధానాలను ఎత్తివేయడంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేస్తుందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది.

కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2023లో కరోనాతో ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ ఎవాల్యుయేసన్‌ (ఐహెచ్‌ఎంఈ) హెచ్చరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి చైనాలో కరోనా తారా స్థాయికి చేరుకుంటుందని దేశ జనాభాలో మూడో వంతు మంది కరోనా బారిన పడతారని ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ ముర్రే తెలిపారు. చైనా అనుసరించిన కఠినమైన జీరో కోవిడ్‌ విధానాలపై ప్రజా నిరసన వెల్లువెత్తడంతో ప్రభుత్వం వాటిని పూర్తిగా ఎత్తేసింది. రోజుకి లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌కు చాపకింద నీరులా విస్తరించే గుణం ఉండడంతో ఎన్ని కఠినమైన నిబంధనలు విధించినా మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యంకాదని ముర్రే పేర్కొన్నారు. 

New Zealand: యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం

Published date : 19 Dec 2022 04:22PM

Photo Stories