Super Memory: రెండున్నరేళ్ల వయస్సు బాలుడికి...కిరాక్ మెమరి..ఎలా అంటే
Sakshi Education
నూజివీడు: రెండున్నరేళ్ల వయస్సులో తన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కలపాల తోషిత్‌రామ్.
రెండున్నరేళ్లు అంటే మాటలుకూడా రాని వయస్సు. కానీ తోషిత్‌రామ్ మాత్రం తన ఐక్యూతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
ఈ ఏడాది జూలైలో నిర్వహించిన పోటీల్లో తోషిత్ ఇంగ్లిష్ అక్షరాలను ఏ నుంచి జెడ్ వరకు, తిరిగి రివర్స్ ఆర్డర్‌లో జెడ్ నుంచి ఏ వరకు కేవలం 22 సెకన్లలోనే టకటకా చెప్పేశాడు. దీంతో యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కిడ్‌గా తోషిత్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. గతంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఈ బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్‌ప్రసాద్ టీటీడీలో ఉద్యోగి, తల్లి భవ్యశ్రీ స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
Published date : 04 Oct 2021 06:17PM