Skip to main content

Zee-Sony Merger: దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఏది?

Sony and Zee

దేశీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో నయా డీల్‌కు తెరలేచింది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)తో లిస్టెడ్‌ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జీల్‌) విలీనం కానుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెప్టెంబర్‌ 22న తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 11,600 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. అంతేకాకుండా 52.93 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. మిగిలిన 47.07 శాతం వాటాను జీ పొందనుంది. విలీన సంస్థ నిర్వహణ పగ్గాలను జీల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ గోయెంకా చేపట్టనున్నారు. విలీన సంస్థలో మెజారిటీ బోర్డు సభ్యులను సోనీ నియమించనుంది.

అతిపెద్ద నెట్‌వర్క్‌...

ఎస్‌పీఎన్‌ఐతో జీల్‌ విలీనం తర్వాత... సంయుక్త సంస్థ 70 టీవీ చానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులు(జీ5, సోనీ లివ్‌), రెండు స్టూడియోల (జీ, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా)ను కలిగి ఉంటుంది. వెరసి దేశంలో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా ఆవిర్భవించనుంది. దీంతో దేశీ మార్కెట్లో సమీప ప్రత్యర్థి సంస్థగా స్టార్‌ డిస్నీ నిలవనుంది.

చ‌ద‌వండి: మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న బ్యాంక్‌?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)తో విలీనం కానున్న సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 22
ఎవరు    : జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జీల్‌)
ఎందుకు  : ఎస్‌పీఎన్‌ఐ, జీల్‌ మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు...

 

Published date : 23 Sep 2021 01:01PM

Photo Stories