Skip to main content

Yokohama: రూ.680 కోట్లతో యకహోమా విస్తరణ

జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్‌ విశాఖపట్నం యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

సుమారు రూ.680 కోట్ల పెట్టుబడితో ప్యాసింజర్‌ కార్‌ టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఏడాదికి దాదాపు 17 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయబోతోంది. 2024 చివరి త్రైమాసికానికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రస్తుతం 28 లక్షల టైర్లుగా ఉన్న ఏటీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 45 లక్షల టైర్లకు చేరుకోనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూనిట్‌లో 22 అంగుళాల వర కు ఉండే టైర్లను ఉత్పత్తి చేస్తారు. 
దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరించిందని.. ఇదే రకమైన వృద్ధి భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందని యకహోమా అంచనా వేస్తోంది. 2007లో 7 లక్షల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో భారత్‌లోకి అడుగుపెట్టిన యకహోమా గ్రూప్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ గ్రూప్‌కు భారత్‌లో ఇప్పటికే రెండు యూనిట్లు (తిరునల్వేలి, దహేజ్‌) ఉండగా.. మూడో యూనిట్‌ను విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)
సీఎం చేతుల మీదుగా తొలి దశ ప్రారంభం.. 
యకహోమా గ్రూప్‌ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీ(ఏటీసీ)ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆగస్టు 16న ప్రారంభించారు. తొలి దశలో రూ.1,384 కోట్లతో హాఫ్‌ హైవే టైర్ల తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. 3.7 కేజీల నుంచి 1.26 కేజీల బరువు ఉండే భారీ టైర్లను ఈ యూనిట్‌లో తయారు చేస్తోంది. ఇక్కడ తయారైన టైర్లను 120కు పైగా దేశాలకు ఎగుమతి చేయనుంది. విశాఖ యూనిట్ల ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.

JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమి పూజ

Published date : 19 Feb 2023 04:21PM

Photo Stories