World Bank: భారత్‌కు ప్రపంచబ్యాంకు 175 కోట్ల డాలర్ల రుణం
ప్రపంచ బ్యాంక్.. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీంతోపాటు దేశంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూ.13,834.54 కోట్ల (1.75 బిలియన్ డాలర్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో 100 కోట్ల డాలర్లు ఆరోగ్య రంగానికి, మరో 750మిలియన్ల డాలర్లు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అంతరాయాన్ని భర్తీ చేసేందుకు డెవలప్‌మెంట్ పాలసీ లోన్(డీపీఎల్) కింద రుణంగా మంజూరు చేయనున్నది. భారత్‌లో ఆరోగ్యరంగ వృద్ధి కోసం, ఆరోగ్య రంగానికి మద్దతుగా 500 మిలియన్ల డాలర్ల చొప్పున రెండు అనుబంధ రుణాలు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫాస్ట్రక్చర్ మిషన్(పీఎం–ఏబీహెచ్‌ఐఎం)కు 100 కోట్ల రుణం ఇవ్వనున్నది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం మంజూరు చేసిన ఈ రుణంతో దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య రంగ మౌలిక వసతులను మెరుగుపరుస్తారు.
GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP