TS Exports: సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం
సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరి శ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరి శ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను జూన్ 30న వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధా నానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అఛీ వర్స్, అఛీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్ ఇకో సిస్టమ్స్ అనే 4 కేటగిరీ లుగా విభజించింది. అయితే టాప్ అఛీవర్స్ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరి యాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 301 అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని డీపీఐఐటీ ఆదే శించింది. అం దులో భాగంగా తెలంగాణ 301 అంశాల్లోనూ సంస్క రణలు చేపట్టి నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. అయితే గతంలో ర్యాంకుల ప్రకట నలో ఎదురైన అస్పష్టతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కేటగిరీ లుగా వెల్లడించింది. 301 సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలకు ఒకటి, రెండు అంశాల్లోనూ అగ్రస్థానం దక్కిం దని, తెలంగాణ మాత్రం అనేక నిబంధనల్లో అగ్రస్థానం దక్కించు కుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
Also read: Business Reforms Action Plan : నెంబర్ 1 స్థానంలో ఏపీ.. తర్వాత ప్లేస్‌లో ఇవే..
2015లో ఈవోడీబీ ర్యాంకుల విధానం ప్రారంభంకాగా తొలిసారి 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2017లో రెండు, 2019లో మూడోస్థానంలో నిలిచింది. కాగా, ఈవోడీబీ ర్యాంకింగ్‌లో తెలంగాణకు టాప్ అఛీవర్స్ జాబితాలో చోటుదక్కడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సులభతర వాణిజ్యంతో ప్రశాంత వాణిజ్యం కూడా సాధ్యమని ట్వీట్ చేశారు.
Also read: ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ టాప్..
వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయో జనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానాన్ని సాధించింది. దీంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 97.89%తో మొదటిస్థానంలో నిలిచింది.