Skip to main content

Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్‌ ఇన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన

ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది.
Tax Exemption
Tax Exemption

ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని 2002లో నిర్ణయించారు.

సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ.25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉ‍ద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇది 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది.

Published date : 26 May 2023 01:25PM

Photo Stories