Skip to main content

Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఎనిమిదో సారీ కీలక వడ్డీ రేటు(రెపో)ను 6.5 శాతంగా యథాతథంగా ఉంచింది.
RBI keeps repo rate unchanged at 6.5%, forecasts 7.2% GDP growth for FY25

ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 

2024-25 వృద్ధి 7.2%: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత ఆర్థిక వృద్ధి 7.2%కి చేరుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇది గతంలో అంచనా వేసిన 7% కంటే ఎక్కువ.

ద్రవ్యోల్బణం 4.5%: ద్రవ్యోల్బణం 2024-25లో 4.5% వద్ద ఉండే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

వడ్డీ రేటు తగ్గించాలని 2 ఓట్లు: గత సమీక్షలో ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే వడ్డీ రేటును తగ్గించాలని ఓటు వేశాడు. ఈసారి ఆ సంఖ్య ఇద్దరికి పెరిగింది.

బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు: బ్యాంకుల అసెట్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడానికి, బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచింది.

యూపీఐ లైట్, ఫాస్టాగ్‌లకు ఆటో లోడ్: చిన్న మొత్తాల చెల్లింపులకు ఉపయోగించే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా లోడ్ అయ్యే సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ సదుపాయం యూపీఐ లైట్ వినియోగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు.

Reserve Bank of India: ఈ బ్యాంక్‌లకు భారీ జరిమానా విధించిన ఆర్‌బీఐ!

పేమెంట్స్ లోపాలకు బ్యాంకుల వైఫల్యాలే కారణం: చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలకు కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐ వ్యవస్థలు కాదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నిర్ణయాలు తీసుకుంది. 

Published date : 08 Jun 2024 04:40PM

Photo Stories