Skip to main content

Reserve Bank of India: ఏ సహకార బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది?

RBI and PMC Bank

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌పై ఆంక్షలను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిసెంబర్ 28న ప్రకటించింది. దీనితో పీఎంసీపై మరో మూడు నెలలు అంటే 2022 మార్చి వరకూ ఆంక్షలు కొనసాగుతాయి. సంక్షోభంలో ఉన్న పీఎంసీ బ్యాంకును ఢిల్లీకి చెందిన యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (యూఎస్‌బీఐ ) స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ స్కీమ్‌ పక్రియ ఇంకా పూర్తి కానుందున ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

2019 సెప్టెంబర్‌లో...

  • రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలను దాచిపెట్టడం,  తప్పుగా నివేదించడం వంటి కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసింది.  ఆ బ్యాంక్‌ ఖాతాదారుల ఉపసంహరణలపై పరిమితులుసహా పలు నియంత్రణలు విధించింది. ఆ తర్వాత పలుమార్లు ఆంక్షలు పొడిగించింది.   
  • విలీనం ముసాయిదా పథకం ప్రకారం, యూఎస్‌ఎఫ్‌బీ ద్వారా డిపాజిట్లతో సహా పీఎంసీ బ్యాంక్‌ ఆస్తులు, రుణాలు స్వాధీనం అవుతాయి. తద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలకు కూడా అధిక రక్షణ కలుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. 

యూఎస్‌ఎఫ్‌బీ..
యూఎస్‌ఎఫ్‌బీని ‘జాయింట్‌ ఇన్వెస్టర్‌’గా సెంట్రమ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, రెసైలెంట్‌ ఇన్నోవేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోట్‌ చేస్తున్నాయి. దీనికి 2021 అక్టోబర్‌లో బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కూడా లభించింది. నవంబర్‌ 1 నుంచీ యూఎస్‌ఎఫ్‌బీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

చ‌ద‌వండి: కేబినెట్‌ ఆమోదం తెలిపిన డీఎల్‌ఐ పథక ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌పై మరో మూడు నెలలపాటు ఆంక్షలు పొడిగింపు 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : సంక్షోభంలో ఉన్న పీఎంసీ బ్యాంకును యూఎస్‌బీఐ స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ స్కీమ్‌ పక్రియ ఇంకా పూర్తి కానుందున..

Published date : 29 Dec 2021 02:27PM

Photo Stories