Skip to main content

Hyderabad GDP: జీడీపీ వృద్ధిలో హైదరాబాద్‌ టాప్‌

hyderabad gdp growth ranking

ప్రపంచంలోనే అత్యదిక జీడీపీ వృద్ధి సాధించిన నగరాల్లో హైదరాబాద్‌ దేశంలోనే టాప్‌1గా నిలిచింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ ప్రొజెక్షన్‌ నివేదిక2022 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్‌10 నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. వియత్నాంలోని 'హో చి మిన్‌ ' మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానానికి మన రాజధాని నగరం దూసుకొచ్చింది. టాప్‌10 నగరాల్లో భారత్‌ నుంచి హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వరుసగా ఉన్నాయి. కాగా, 2021లో టాప్‌15లో హైదరాబాద్‌11వ స్థానంలో ఉన్నది. ఏడాదిలోనే రెండో స్థానానికి ఎగబాకింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Sep 2022 05:40PM

Photo Stories