ICRA Ratings హౌసింగ్ ఫైనాన్స్‌లో 10–12 శాతం వృద్ధి
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 10–12 శాతం వృద్ధిని సాధించొచ్చని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతంలో వేసిన 9–11 శాతం అంచనాలను పెంచింది. హెచ్‌ఎఫ్‌సీల రుణాల మంజూరులో స్థిరమైన పురోగతి ఉండడంతో అంచనాలను స్వల్పంగా పెంచినట్టు ఇక్రా తెలిపింది. కరోనా రెండో విడత కారణంగా ఏర్పడిన ప్రతికూలతల నుంచి పరిశ్రమ కోలుకుందని, రుణాల వితరణలో మెరుగుదల ఉండడంతో గడిచిన కొన్ని త్రైమాసికాలుగా హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియోలో వృద్ధి కనిపిస్తున్నట్టు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్‌దేవ తెలిపారు. దీంతో 2021–22లో హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియోలో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. 2021–22లో ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో 11 శాతం వృద్ధితో రూ.12.2 లక్షల కోట్లకు చేరుకుందని.. తమ అంచనాలు 8–10 శాతం కంటే ఎక్కువే నమోదైనట్టు ఇక్రా తెలిపింది.
Also read: 5.4 శాతానికి RBI Repo Rate
తగ్గుతున్న మొండి బకాయిల భారం..
2021–22 మొదటి మూడు నెలల్లో (2021 ఏప్రిల్–జూన్) కరోనా రెండో విడత ప్రభావం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వ్యాపారంపై ప్రభావం చూపించినా.. తదుపరి మూడు త్రైమాసికాల్లో మంచి పురోగతి కనిపించినట్టు వివరించింది. 2021–22 మూడో త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) పెరిగిపోయినప్పటికీ, చివరి త్రైమాసికంలో తగ్గినట్టు పేర్కొంది. మొండి బాకీలను గుర్తించే విషయంలో కఠిన నిబంధనల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. బకాయిల వసూళ్లు పుంజుకోవడం మొండి బాకీలు తగ్గేందుకు సాయపడినట్టు వెల్లడించింది. వసూళ్లు మరింత మెరుగుపడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌పీఏలు ఇంకా తగ్గుతాయని పేర్కొంది.
Also read: Chief Justice of India N.V. Ramana: జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP