Skip to main content

BBB- Grade: భారత్‌ రేటింగ్‌ను నెగటివ్‌ అవుట్‌లుక్‌తో కొనసాగించిన సంస్థ?

Fitch Ratings

భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’ వద్ద కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్జజ సంస్థ– ఫిచ్‌ తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా, 2022–23లో 10 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది. ఈ మేరకు నవంబర్‌ 16న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఫిచ్‌ దేశానికి ఇస్తున్న రేటు ‘బీబీబీ మైనస్‌’ చెత్త (జంక్‌) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ.

మూడీస్‌ కూడా...

అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ మూడీస్‌... ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ ‘బీఏఏ3’ సావరిన్‌ రేటింగ్‌ను ఇస్తోంది. ఇది కూడా జంక్‌ (చెత్త) స్టేటస్‌కు స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. మరో రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఎస్‌అండ్‌పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తోంది.

 

ప్రాముఖ్యత ఎందుకు?

అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఇచ్చే సావరిన్‌ రేటింగ్‌ ప్రాతిపదికగానే ఒక దేశంలో  పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతి యేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్‌ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు.
 

చ‌ద‌వండి: డోజోన్స్‌ ఇండెక్స్‌లో తొలి స్థానంలో నిలిచిన కంపెనీ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’ వద్ద కొనసాగించిన సంస్థ?
ఎప్పుడు    : నవంబర్‌ 16
ఎవరు    : అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్జజ సంస్థ– ఫిచ్‌
ఎందుకు : దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Nov 2021 06:09PM

Photo Stories