Skip to main content

Asian Development Bank: ఏడీబీ అంచనాల ప్రకారం... 2021–22లో భారత్‌ వృద్ధి రేటు ఎంత?

Growth Rate

2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు 10 శాతంగా నమోదవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది. ఈ మేరకు గత ఏప్రిల్‌నాటి అంచనా 11 శాతాన్ని... 10 శాతానికి కుదిస్తూ  సెప్టెంబర్‌ 22న ఒక నివేదిక(ఆసియా డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌–ఏడీఓ)ను విడుదల చేసింది. కోవిడ్‌–19 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన నివేదికలో పేర్కొంది.

ఏడీబీ అవుట్‌లుక్‌లోని ముఖ్యాంశాలు...

  • 2022–23లో భారత్‌ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది.
  • కరోనా సెకండ్‌వేవ్‌ భారత్‌ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
  • 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గుతుంది.
  • 2021లో చైనా వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంటుంది. గృహ డిమాండ్‌ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్‌ దీనికి కారణం.
  • దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది. 
  • అమెరికా, యూరో ప్రాంతం, జపాన్‌లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. 
  • వేగవంతమైన వ్యాక్సినేషన్‌ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది.

చ‌ద‌వండి: కేంద్ర ఆవిష్కరించిన సింగిల్‌ విండో పోర్టల్‌ ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు 11 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : సెప్టెంబర్‌ 22
ఎవరు    : ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)
ఎందుకు : కోవిడ్‌–19 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తున్నందున...
 

 

Published date : 23 Sep 2021 02:01PM

Photo Stories