Skip to main content

యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?

ప్రతిష్టాత్మక యూరోపియన్‌ చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో చెల్సీ క్లబ్‌ (ఇంగ్లండ్‌) జట్టు విజేతగా నిలిచింది.
Current Affairs
పోర్చుగల్‌లోని పోర్టో నగరంలో మే 29న జరిగిన ఫైనల్లో సెసర్‌ అప్లిక్వెటా కెప్టెన్సీలోని చెల్సీ క్లబ్‌ జట్టు 1–0తో మాంచెస్టర్‌ సిటీ (ఇంగ్లండ్‌) జట్టుపై గెలిచింది. ఆట 42వ నిమిషంలో కాయ్‌ హావెర్ట్‌జ్‌ ఏకైక గోల్‌ చేసి చెల్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేత చెల్సీ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 167 కోట్లు)... రన్నరప్‌ మాంచెస్టర్‌ సిటీ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 132 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఏజెన్సీ ఆఫ్‌ ద ఇయర్‌గా మైండ్‌షేర్‌...
ఫెస్టివల్‌ ఆఫ్‌ మీడియా గ్లోబల్‌–2021లో తాము ఏజెన్సీ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచామని గ్రూప్‌ఎమ్‌కు చెందిన మైండ్‌షేర్‌ ఇండియా మే 30న తెలిపింది. దీంతోపాటు పలు కేటగిరీల్లో మరో అయిదు అవార్డులు కూడా గెలిచినట్లు పేర్కొంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యూరోపియన్‌ చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లోవిజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మే 29
ఎవరు : చెల్సీ క్లబ్‌ (ఇంగ్లండ్‌) జట్టు
ఎక్కడ : పోర్టో, పోర్చుగల్‌
Published date : 01 Jun 2021 03:24PM

Photo Stories