యూరోపియన్ కప్ టోర్నమెంట్‌లోరన్నరప్ బోపన్న జంట
Sakshi Education
యాంట్‌వర్ప్ (బెల్జియం): ఈ ఏడాది రెండో టైటిల్ సాధించాలని ఆశించిన భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది.
యూరోపియన్ కప్ ఏటీపీ-250 టోర్నమెంట్‌లో బోపన్న-మాట్వీ మిడెల్‌కూప్ (నెదర్లాండ్‌స) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో బోపన్న-మిడెల్‌కూప్ ద్వయం 3-6, 4-6తో రెండో సీడ్ జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించినా తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. రన్నరప్ బోపన్న జోడీకి 7,820 యూరోల (రూ. 6 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది బోపన్న తన భాగస్వామి వెస్లీ కూలాఫ్‌తో కలిసి దోహా ఓపెన్‌లో టైటిల్ సాధించాడు.
Published date : 27 Oct 2020 05:53PM