యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
Sakshi Education
యూరియాయేతర ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాపై ఎరువుల సబ్సిడీ భారం రూ. 22,186.55 కోట్లకు తగ్గనుంది. ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై సబ్సిడీ రేట్లను నిర్ణయించేందుకు ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. నైట్రోజన్‌పై సబ్సిడీని కేజీకి రూ. 18.78కి, పొటాష్‌పై సబ్సిడీని కేజీకి రూ. 10.11కి, పాస్ఫరస్‌పై సబ్సిడీని కేజీకి రూ. 14.88కి, సల్ఫర్‌పై సబ్సిడీని కేజీకి రూ. 2.37కి తగ్గించినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇది నైట్రోజన్‌పై రూ. 18.90గా, పొటాష్‌పై రూ. 11.12గా, ఫాస్ఫరస్‌పై రూ. 15.21గా, సల్ఫర్‌పై రూ. 3.56గా ఉంది. అలాగే, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్‌బీఎస్) ఎరువుల జాబితాలోకి అమ్మోనియం ఫాస్ఫేట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ
Published date : 23 Apr 2020 08:51PM