యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా గోసంరక్షణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 7న ప్రకటించారు.
ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గోసంరక్షణశాలల్లోని లక్ష గోవులను ఎంపిక చేసిన రైతులకు, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు అందజేస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రకారం నెలకు రూ.900 వేతనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. తొలిదశలో ఈ కొత్త స్కీమ్ కింద రూ.109 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎందుకు : యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎందుకు : యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో
Published date : 08 Aug 2019 05:58PM