Skip to main content

యునెస్కో ద్వారా పీవీ నరసింహారావు అవార్డు

దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ 2020, సెప్టంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.
Current Affairs

పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఆగస్టు 28న ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

చదవండి: పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం

సీఎం ప్రకటన-కీలక నిర్ణయాలు

  • విద్యా, వైజ్ఞానిక సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డుకు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదన, అవార్డుకు సంబంధించిన నగదు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం.
  • హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డును ఉద్యానవనాలతో పీవీ జ్ఞానమార్గ్‌గా అభివృద్ధి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయన మెమోరియల్‌ను నిర్మిస్తాం.
  • అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటుతోపాటు, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.
  • పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక
  • హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్.
  • అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనెడా తదితర దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూలు.
  • శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం.
  • ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీకి సన్నిహిత సంబంధాల ఉన్న అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ తదితరులను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయం.
  • పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ముద్రణ, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ తయారు.
Published date : 29 Aug 2020 05:42PM

Photo Stories