యునెస్కో డిఫెన్సెస్ నివేదిక విడుదల
Sakshi Education
నవంబర్ 2ను ‘ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెనైస్ట్ జర్నలిస్ట్స్’గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో నవంబర్ 1న ‘ఇంటెన్సిఫైడ్ అటాక్స్, న్యూ డిఫెన్సెస్’ అనే నివేదికను విడుదల చేసింది.
యునెస్కో డిఫెన్సెస్ నివేదిక-ముఖ్యాంశాలు
- 2017, 2018లో 55 శాతం జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావరణంలేని ప్రాంతాల్లోనే జరిగాయి.
- నేరాలు, అవినీతి, రాజకీయాలపై పాత్రికేయులు జరిపిన రిపోర్టింగ్ కారణంగానే ఈ హత్యలు జరిగాయి.
- ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్యలకు బాధ్యులైన వారిలో 90 శాతం మందికి శిక్షలు పడలేదు.
- 2014 కన్నా ముందు ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్యల కన్నా 2014 తరువాతి ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్య లు 18 శాతం పెరిగాయి.
- ముఖ్యంగా పాత్రికేయుల హత్యల్లో 30 శాతం అరబ్ దేశాల్లో, 26 శాతం లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో, 24 శాతం ఆసియా పసిఫిక్ దేశాల్లో చోటు చేసుకున్నాయి.
Published date : 02 Nov 2019 06:16PM