Skip to main content

యూకేలో పాయింట్స్ ఆధారిత వీసా ఆవిష్కరణ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన ‘పాయింట్స్ ఆధారిత వీసా’ విధానాన్ని బ్రిటన్ ఫిబ్రవరి 19న ఆవిష్కరించింది.
Current Affairs నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. ఈ తాజా వీసా విధానం 2021, జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పాయింట్స్ ఆధారిత వీసా విధానం ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : యూకే ప్రభుత్వం
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు
Published date : 20 Feb 2020 07:18PM

Photo Stories