Skip to main content

యూఎస్ సంస్థ ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం చేసుకున్న భారత ఫార్మా సంస్థ?

బయోటెక్నాలజీ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్, యూఎస్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆక్యుజెన్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
Current Affairs
ఒప్పందంలో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌తో (ఐసీఎంఆర్) కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కోవాగ్జిన్ను యూఎస్ మార్కెట్ కోసం సహ అభివృద్ధి చేస్తారు.

జాతీయ స్టార్టప్ అవార్డులు
జాతీయ స్టార్టప్ అవార్డులు (ఎన్‌ఎస్‌ఏ) -2021 రెండో ఎడిషన్‌ను కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ప్రారంభించింది. 15 విసృ్తత రంగాల్లో 49 విభాగాల్లో స్టార్టప్‌లకు ఈ అవార్డులు ఇస్తారు. విజేతలకు రూ.5లక్షల నగదు ఇవ్వడంతోపాటు రన్నరప్‌లకు కూడా పెలైట్ ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు పొందడానికి అవకాశాలు కల్పిస్తారు. ఎన్‌ఎస్‌ఏ -2021కు జనవరి 31,2021 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యూఎస్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : కోవాగ్జిన్‌ను యూఎస్ మార్కెట్ కోసం అభివృద్ధి చేసేందుకు
Published date : 23 Dec 2020 05:50PM

Photo Stories