యూఎస్ హాకీ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులైన భారతీయుడు?
Sakshi Education
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కోచ్ హరీంద్ర సింగ్ ఇకపై యూఎస్ పురుషుల హాకీ టీమ్ హెడ్ కోచ్‌గా పనిచేయనున్నారు.
ఈ మేరకు అతడిని నియమిస్తూ యూఎస్ జాతీయ పురుషుల టీమ్ (యూఎస్‌ఎమ్‌ఎన్‌టీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయం ఏప్రిల్ 8న వెల్లడైంది. హరీంద్ర సింగ్ పర్యవేక్షణలోని భారత పురుషుల జట్టు 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
కొన్ని వివరాలు...
రంగస్వామి కప్: ఇది జాతీయ సీనియర్ హాకీ చాంపియన్‌షిప్. రంగస్వామి కప్‌ను కర్ణాటక మే, 2013లో తొలిసారి గెలుచుకుంది. బెంగళూర్‌లో జరిగిన ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది.
సుల్తాన్ అజ్లాన్ షా కప్: 1983లో ప్రారంభమైంది. ప్రతి ఏటా మలేసియాలో నిర్వహిస్తారు.
ఇతర ప్రముఖ హాకీ ట్రోఫీలు: ఆగాఖాన్ కప్, బైటన్ కప్, ఇందిరా గోల్డ్ కప్, మోడీ గోల్డ్ కప్, రంజిత్‌సింగ్ గోల్డ్ కప్, బాంబే గోల్డ్ కప్, ధ్యాన్‌చంద్ ట్రోఫీ, లేడీ రతన్ టాటా ట్రోఫీ, గురునానక్, మురుగప్ప గోల్డ్, ఒబైదుల్లా, ప్రపంచ కప్, ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీ.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ హాకీ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులైన భారతీయుడు?
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ద్రోణాచార్య అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కోచ్ హరీంద్ర సింగ్

Published date : 09 Apr 2021 06:19PM