Skip to main content

యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండియన్‌–అమెరికన్‌?

అమెరికా ఫారిన్‌ సర్వీసు సీనియర్‌ అధికారి, తెలుగు మహిళా వీణారెడ్డి భారత్‌లో యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ ఎయిడ్‌) నూతన మిషన్‌ డైరెక్టర్‌గా జూలై 5న ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా తాత్కాలిక రాయబారి అతుల్‌ కేశప్‌ ప్రకటించారు. దీంతో యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేయనున్న తొలి ఇండియన్‌–అమెరికన్‌గా వీణారెడ్డి గుర్తింపు పొందారు. మిషన్‌ డైరెక్టర్‌గా వీణారెడ్డి... ఇండియా, భూటాన్‌లో యూఎస్‌ ఎయిడ్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించిన వీణారెడ్డి అమెరికాలో పెరిగారు. షికాగో యూనివర్సిటీలో బీఏ, ఎంఏ పూర్తిచేశారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి డాక్టర్‌ ఆఫ్‌ జ్యురిస్‌ప్రుడెన్స్‌ పట్టా అందుకున్నారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, లండన్‌లో కార్పొరేట్‌ అటార్నీగా సేవలందించారు. అనంతరం అమెరికా ఫారిన్‌ సర్వీసు అధికారిగా ఎంపికయ్యారు. హైతీలో యూఎస్‌ఎయిడ్‌ డిప్యూటీ మిషన్‌ డైరెక్టర్‌గా, కాంబోడియాలో మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. శాంతియుత, సౌభాగ్యవంతమైన సమాజ స్థాపన కోసం యూఎస్‌ ఎయిడ్‌ గత ఏడు దశాబ్దాలుగా ప్రజలతో, భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని వీణారెడ్డి చెప్పారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండియన్‌–అమెరికన్‌?
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : వీణారెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇండియా, భూటాన్‌లో యూఎస్‌ ఎయిడ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు...
Published date : 06 Aug 2021 06:04PM

Photo Stories