Skip to main content

యూఎన్ఈపీ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ఎవరు ఉన్నారు?

2019లో ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయ్యింది. ఇందులో భారతదేశం వాటా 68.7 మిలియన్ టన్నులు ఉంది.
Edu news

ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్నేషన్స్ఎన్విరాన్మెంట్ప్రోగ్రామ్‌(యూఎన్ఈపీ) ఫుడ్వేస్ట్ఇండెక్స్రిపోర్ట్‌–2021లో వెల్లడించింది.

ఫుడ్వేస్ట్రిపోర్ట్‌–ముఖ్యాంశాలు

  •  2019లో వృథా అయిన ఆహారంలో 61 శాతం గృహాల నుంచి, 26 శాతం ఫుడ్‌ సర్వీసు సెంటర్లు, 13 శాతం రిటైల్‌ మార్కెట్‌ నుంచి వచ్చింది.
  •  ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో 17 శాతం వృథా అయింది. 
  •  వృథా అయిన ఆహారాన్ని 23 మిలియన్ల ట్రక్కుల్లో(40 టన్నుల సామర్థ్యం కలిగినవి) నింపొచ్చు. ఈ ట్రక్కులను వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఆనుకునేలా నిలిపితే భూగోళాన్ని ఏడుసార్లు చుట్టేయవచ్చు.

భారత్లో...

  • భారత్‌లో ప్రతి ఇంట్లో ఏటా 50 కిలోల ఆహారం వృథాగా మారిపోతున్నట్లు అంచనా. అంటే దేశవ్యాప్తంగా ప్రతిఏటా 6,87,60,163 టన్నుల తిండి వృథా అవుతోంది. అమెరికాలో ఇది 1,93,59,951 టన్నులు కాగా, చైనాలో 9,16,46,213 టన్నులు.
  • గృహాల్లో అందుబాటులో ఉన్న ఆహారంలో 11 శాతం పనికిరాకుండా పోతోంది. ఫుడ్‌ సర్వీసు సెంటర్లలో 5 శాతం, రిటైల్‌ ఔట్‌లెట్లలో 2 శాతం ఆహారం వృథా అవుతోంది.

యూఎన్ఎన్విరాన్మెంట్ప్రోగ్రామ్‌(UNEP)...
ప్రధాన కార్యాలయం: నైరోబీ (కెన్యా)
స్థాపన: 1972, జూన్‌ 5
ప్రస్తుత ఎగ్జిక్యూటివ్డెరైక్టర్‌: ఇంగర్‌ ఆండర్సన్‌(డెన్మార్క్‌)

క్విక్రివ్యూ :
ఏమిటి : 2019లో 931 మిలియన్‌ టన్నుల ఆహారం వృథా
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌ఈపీ) ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2021
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

Published date : 06 Mar 2021 06:56PM

Photo Stories