Skip to main content

యూఎన్‌డీపీ హ్యుమానిటేరియన్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ నటుడు?

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక <b>ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు</b> లభించింది.
Current Affairs
కరోనా సంక్షోభ కాలంలో దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 28న ఆన్‌లైన్ ద్వారా సోనూసూద్‌కిఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడిగా సోనూసూద్ నిలిచాడు. ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) ఈ అవార్డును అందజేస్తోంది. యూఎన్‌డీపీ పేదరిక నిర్మూలన కోసం 170కి పైగా దేశాల్లో పనిచేస్తోంది.

నిఖార్సయిన హీరోగా...
ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలతో సుపరిచితమైన సోనూసూద్ అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి ప్రజల మనస్సుల్లో నిఖార్సయిన హీరోగా నిలిచిపోయారు. వలస కార్మికులు, విద్యార్థులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోన్న వారిని రక్షించడంలో ఆపద్బాంధవుడయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌లు కొనివ్వడం, సిగ్నల్ లేని ప్రాంతాల్లో మొబైల్ టవర్స్‌ని ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను సోనూ చేపట్టారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ నటుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సోనూసూద్
ఎందుకు : కరోనా సంక్షోభ కాలంలో దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవకుగాను
Published date : 30 Sep 2020 05:19PM

Photo Stories