యూఏఈలో ఐపీఎల్–13వ సీజన్
Sakshi Education
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కారణంగా యూఏఈ వేదికగా ఐపీఎల్-13వ సీజన్ జరుపుతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో ఐపీఎల్–13వ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్ పాలకమండలి వివరాల ప్రకారం... ఐపీఎల్ సీజన్ 2020, సెప్టెంబర్ 19న మొదలై నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్-13వ సీజన్ నిర్వహణ
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)
ఎక్కడ :యూఏఈలోనిదుబాయ్, అబుదాబి, షార్జా
ఎందుకు :భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్-13వ సీజన్ నిర్వహణ
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)
ఎక్కడ :యూఏఈలోనిదుబాయ్, అబుదాబి, షార్జా
ఎందుకు :భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కారణంగా
Published date : 04 Aug 2020 05:37PM