యస్ బ్యాంక్ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించిన ‘పునరుద్ధరణ ప్రణాళిక’కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 13న తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ.. 49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్‌బీఐ డెరైక్టర్లు ఇద్దరు ఉంటారని చెప్పారు. ఇక పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఆర్‌బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు
Published date : 14 Mar 2020 05:53PM