Skip to main content

యోకొహామా టైర్ల ప్లాంట్‌ను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?

జపాన్ దిగ్గజం యోకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ) విశాఖలో తమ టైర్ల ప్లాంటు ఏర్పాటు చేయనుంది.
Current Affairs
దీనిపై 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,240 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. 2023 తొలి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి రాగలదని యోకొహామా ఇండియా చైర్మన్, ఏటీజీ డెరైక్టర్ నితిన్ వెల్లడించారు. దీనితో కొత్తగా 600 ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ఏటీజీకి ఇజ్రాయెల్‌లో 45,000 టన్నుల ప్లాంటుతో పాటు ప్రధాన అభివృద్ధి, పరిశోధన (ఆర్‌అండ్‌డీ) కేంద్రం ఉంది. దేశీయంగా గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు చేసేది మూడోది అవుతుంది. తిరునల్వేలి ప్లాంటులోనూ ఆర్‌అండ్‌డీ సెంటర్ ఉంది. 2016లో ఏటీజీని యోకొహామా గ్రూప్ కొనుగోలు చేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : టైర్ల ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జపాన్ దిగ్గజం యోకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 14 Sep 2020 06:04PM

Photo Stories