Skip to main content

యాక్సలరేటింగ్ ఇండియా పుస్తకానికి సంపాదకత్వం వహించిన వ్యక్తి?

మాజీ కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ సంపాదకత్వంలో వచ్చిన ‘యాక్సలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సాధించిన ప్రగతిని వివరిస్తూ..

28 మంది ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌ అధికారులు, విషయ నిపుణులు రాసిన 25 వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. న్యూఢిల్లీలో ఆగస్టు 9న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఎన్ఎస్తో ఎలాంటి లావాదేవీల్లేవ్‌: కేంద్రం
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ టెక్నాలజీ సంస్థతో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని భారత రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం భారత్‌ను కుదిపేస్తున్న పెగసస్‌ మిలటరీ–గ్రేడ్‌ స్పైవేర్‌ను ఇదే సంస్థ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో ఆగస్టు 9న సీపీఎం సభ్యుడు వి.సదాశివన్‌ అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ స్పందిస్తూ ఒక లిఖితపూర్వక ప్రకటన జారీ చేశారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : మాజీ కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్‌ సంపాదకత్వంలో వచ్చిన యాక్సలరేటింగ్‌ ఇండియా: 7 ఇయర్స్‌ ఆఫ్‌ మోదీ గవర్నమెంట్‌ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వివిధ ప్రభుత్వ విభాగాలు సాధించిన ప్రగతిని వివరించేందుకు...

Published date : 10 Aug 2021 06:41PM

Photo Stories