Wrestling: రెజ్లింగ్ కోసం 170 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్రం?
Sakshi Education
వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేలా దేశంలో రెజ్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఉత్తరప్రదేశ్ (యూపీ) ప్రభుత్వం ముందుకు వచ్చింది.
హాకీ పునరుత్తేజం కోసం ఒడిశా ప్రభుత్వం అనుసరించిన ప్రణాళికనే రెజ్లింగ్‌లోనూ ప్రవేశపెట్టాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే 11 ఏళ్లలో (2022–32 మధ్య) మూడు దఫాలుగా రెజ్లింగ్ కోసం 170 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్ ఆగస్టు 26న తెలిపారు. టోక్యో ఒలింపిక్స్–2020లో భారత రెజ్లర్లు రెండు పతకాలు (రజతం, కాంస్యం) సాధించిన విషయం విదతమే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే 11 ఏళ్లలో (2022–32 మధ్య) మూడు దఫాలుగా రెజ్లింగ్ కోసం 170 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్రం?
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేలా దేశంలో రెజ్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు...

Published date : 28 Aug 2021 06:17PM