Skip to main content

Vice President Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రస్థానంపై కేంద్రం రూపొందించిన పుస్తకం పేరు?

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నాలుగో ఏడాది విశేషాలతో ప్రతిబింబించడం (రిఫ్లెక్టింగ్‌), గుర్తు చేసుకోవడం (రికలెక్టింగ్‌), తిరిగి కలవడం(రీకనెక్టింగ్‌) పేరుతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఒక పుస్తకాన్ని ప్రచురించింది.
ఈ పుస్తకాన్ని ఆగస్టు 27న ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అందజేశారు. 183 పేజీల ఈ పుస్తకం నాలుగో ఏడాదిలో ఉపరాష్ట్రపతి ముఖ్యమైన కార్యకలాపాలను ఐదు అధ్యాయాల్లో వివరిస్తుంది. ఈ పుస్తకం ప్రజలకు ఓ రకమైన జవాబుదారీ పత్రం (రిపోర్ట్‌ కార్డ్‌) లాంటిదని వెంకయ్య పేర్కొన్నారు. కాగా, టైమ్స్‌ లిట్‌ ఫెస్ట్‌ (సాహిత్యోత్సవం)ను ఉద్దేశించి ఆగస్టు 27న అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రతిబింబించడం (రిఫ్లెక్టింగ్‌), గుర్తు చేసుకోవడం (రికలెక్టింగ్‌), తిరిగి కలవడం(రీకనెక్టింగ్‌) పేరుతో పుస్తక రూపకల్పన
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ
ఎందుకు : భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నాలుగో ఏడాది విశేషాలతో...
Published date : 28 Aug 2021 06:08PM

Photo Stories