వ్యూహాత్మక అంశాలపై ట్రంప్, మోదీ చర్చలు
Sakshi Education
అమెరికా-భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చించారు.
ఈ విషయాన్ని జనవరి 6న వైట్‌హౌజ్ వెల్లడించింది. భారత్‌తో ద్వైపాక్షిక అంశాలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని ట్రంప్ చెప్పినట్లు పేర్కొంది.
ట్రంప్-మోదీల ఫోన్ కాల్‌పై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా స్పందించింది. అమెరికా-భారత్ మైత్రి బలపడటమేగాక, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారని తెలిపింది. వీరిరువురి ఫోన్ కాల్‌కు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో జనవరి 5న ఫోన్‌లో మాట్లాడారు.
మాదిరి ప్రశ్నలు

1. ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు?
1. రాజ్‌నాథ్ సింగ్
2. అజిత్ దోవల్
3. ఎస్ జైశంకర్
4. రవీశ్ కుమార్
- View Answer
- సమాధానం : 3
2. ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) సహాయమంత్రిగా ఎవరు ఉన్నారు?
1. డాక్టర్ హర్షవర్ధన్
2. డాక్టర్ జితేంద్ర సింగ్
3. కిరణ్ రిజిజు
4. అశ్వని కుమార్ చౌబే
- View Answer
- సమాధానం : 2
Published date : 08 Jan 2020 05:32PM