వ్యాధి నిర్ధారణ కిట్ల ఎగుమతులపై నిషేధం
Sakshi Education
కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాధి నిర్ధారణ కిట్ల ఎగుమతులపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో
వ్యాధి నిర్ధారణ కిట్ల (డయాగ్నొస్టిక్ కిట్ల) ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఈ కిట్ల అవసరం చాలా వుందని పేర్కొంది. డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతులను (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) నిలిపివేస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. మరోవైపు కరోనావైరస్ నిరోధంలో అవసరమైన రక్షణ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాధి నిర్ధారణ కిట్ల ఎగుమతులపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో
Published date : 06 Apr 2020 06:27PM